Maharashtra |ఇన్ఫార్మర్ అన్న అనుమానంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. మహారాష్ట్రంలోని కోడెగావ్ జిల్లా పూగర్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి తుండిపారా కాస్పారా గ్రామానికి వచ్చిన మావోయిస్టుల దళం మొత్తం ఆరుగురు గ్రామస్తులను నిర్భంధించి అడవుల్లోకి తీసుకెళ్లింది. కొంతదూరం వెళ్లిన తరువాత నలుగురిని విడిచి పెట్టింది. మిగతా ఇద్దరిలో ఒకరు ఎలాగోలా తప్పించుకుని ఊరికి చేరాడు. అఖరు వ్యక్తిని మావోయిస్టులు చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -
Read Also: విమానంలో ప్రయాణికుడిపై మూత్రం పోసిన విద్యార్థి
Follow us on: Google News