ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో(Manipur) మైతీ, కుకీ తెగల మధ్య రేగిన ఘర్షణ హింసాత్మక ఆందోళనలకు దారితీసిన సంగతి తెలిసిందే. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వ బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించడంతో కాస్త పరిస్థితి సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగడంలేదు. అయినా కానీ జనజీవనం సాధారణ స్థితికి ఇంకా రాలేదు.
దీంతో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పెట్రోల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్‌ను బ్లాక్ మార్కెట్‌లో రూ.200 వరకు అమ్ముతున్నారు. అలాగే లీటర్ వంట నూనె ధర రూ.250 పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రంలో(Manipur) పరిస్థితులను త్వరితగతిన చక్కదిద్దాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.