‘రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయకుండా ఉండాల్సింది’

-

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం ఎక్కువే అనిపించిందని అభిప్రాయపడ్డారు. అలాగే, అధికార పక్షం కూడా కొంత పెద్ద మనసు చేసుకోవాల్సిందని సూచించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని అంత వేగంగా తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసే గడువు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు.

- Advertisement -

‘నేను న్యాయ నిపుణుడిని కాదు. కానీ, ప్రాసెస్ ఆఫ్ లాను చూస్తే రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి విధించిన శిక్ష మోతాదు ఎక్కువే అనిపిస్తున్నది. ఎన్నికల వేడిలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదే చివరిదీ కాబోదు’ అని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలను కేంద్రానికి గుర్తు చేయదలిచాను. ‘చిన్న హృదయంతో పెద్దోడివి కాలేవు అనే మాటను కేంద్రం గుర్తు చేసుకోవాలి’ అని ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా తాము ఎవరితో పోరాడుతున్నామో పూర్తిగా అవగాహనకు రాలేదని అనిపిస్తున్నదని అన్నారు.

Read Also: ఏ పార్టీలో చేరబోయేది అప్పుడే ప్రకటిస్తా: మాజీ ఎంపీ పొంగులేటి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...