Cotton Candy | తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

-

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా పీచు మిఠాయిని తయారు చేసినా, విక్రయించినా కఠిణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టే అధికారులు పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే క్యానర్స్ కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. దీనిని వస్త్రాలకు రంగులు వేయడం, పేపర్ ప్రింటింగ్‌లో వినియోగిస్తారు.

- Advertisement -

దీని వల్ల క్యాన్సర్ రావడంతో పాటు మూత్రపిండాలు, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే తక్షణమే పీచు మిఠాయి వినియోగాన్ని స్టాలిన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా పీచు మిఠాయిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

పీచు మిఠాయిని ఇంగ్లీష్‌లో కాటన్ క్యాండీ అని పిలుస్తారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఫెయిరీ ఫ్లాస్, బుద్ధి కే బాల్ అని కూడా పిలుచుకుంటారు. దీనిని ఒకరకమైన షుగర్ సిరప్ నుంచి తయారు చేస్తారు. మిషన్‌లో నుంచి పోగులు పోగులుగా వచ్చే దారాలను ఒక కర్రపై తీసుకుని వివిధ ఆకృతుల్లో తయారు చేస్తారు. అయితే కొందరు వ్యాపారులు లాభాలకు ఆశపడి పీచు మిఠాయి రంగుల్లో కనపడటం కోసం అత్యంత విషపూరితమైన రసాయనాలు వినియోగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...