ఉత్తర ప్రదేశ్‌లో గత ఆరేళ్లుగా మునుపెన్నడూ లేని మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వం ఒక కారణమైతే, ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వం మరో కారణం. ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చేపడుతున్న తీర్మానాలు ఒక దార్శనికత, కర్తవ్యదీక్షతో కూడిన విజయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు బీమారీ రాష్ట్రాల్లో ఒకటిగా పేరొందిన యూపీ ఇప్పుడు అభివృద్ధి, విశ్వాసం, ఆకాంక్షలవైపు శరవేగంగా అడుగులేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల అమలు ద్వారా రాష్ట్రం లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అడుగులు ముందుకేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) భారత్ గురించి గతంలో ఉన్న దృక్పథాన్ని ఇటీవల ఒక ప్రసంగం ద్వారా తెలిపారు. భారతదేశం గురించి ఎప్పుడు సంభాషణ, చర్చ జరిగినా, అది ప్రశ్నతో మొదలై, ప్రశ్నతోనే ముగిసేదని, కానీ ఆ వైఖరిలో మార్పు వస్తోందని మోడీ చెప్పారు. భారత్ గురించిన తొలి ప్రశ్న స్థానంలో విశ్వాసం ఏర్పడుతోందని, రెండో ప్రశ్న స్థానంలో ఊహ లేదా ఆపేక్ష చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిత్వంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇదే చోటుచేసుకుంటోందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే యూపీ గురించిన దృక్పథంలో మార్పులు రావడమే కాదు… ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఒక నూతన విశ్వాసం ఇప్పటికే రంగంమీదికి వచ్చేసింది.
2018 ఫిబ్రవరిలో యూపీ మదుపుదారుల సదస్సును నిర్వహించారు. ఆ సదస్సును ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, యూపీలో విలువలు, గుణాలు మిక్కుటంగా ఉంటున్నాయి కానీ విలువ జోడింపు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. సీఎం యోగి ఆ వ్యాఖ్యను ఎంత తీవ్రంగా తీసుకున్నారంటే రాష్ట్రంలోని ప్రతిరంగంలోనూ విలువ జోడింపునకు హామీ ఇస్తానని ప్రతినచేసారు. ప్రధాని తరచుగా చెప్పే 3 C లు (క్లారిటీ, కన్విక్షన్, కాన్ఫిడెన్స్), 5 T లు (టాలెంట్, ట్రేడ్, ట్రెడిషన్, టెక్నాలజీ, టూరిజం)కు అనుగుణంగా రాష్ట్రాన్ని మార్చివేసే సంస్కరణలను యోగి తీసుకొచ్చారు. దీని ఫలితంగా ఈరోజు ఉత్తరప్రదేశ్ యావద్దేశం ముందు, ప్రపంచం ముందు సత్పరిపాలనకు నమూనాగా మారడమే కాదు… ఆర్థికాభివృద్ధికి, సంక్షేమానికి నమూనాగా కూడా మారిపోయింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి రాష్ట్రానికి, ప్రజల జీవితాలకు భద్రత చేకూర్చే నమూనాను యోగి(Yogi Adityanath) చేపట్టారు. ఆ నమూనా విజయవంతమై జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలందుకుంది.
గత ఆరేళ్లలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై యోగి ప్రదర్శించిన దార్శనికత ప్రభావం వల్ల ఈ సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 35 లక్షల కోట్ల విలువైన మదుపు ప్రతిపాదనలను సాకారం చేసింది. అంటే నేడు ఉత్తరప్రదేశ్‌పై దేశంలోని, ప్రపంచంలోని మదుపుదారులు, వాణిజ్యవేత్తలు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని దీనర్థం. మరోమాటలో చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ నేడు వాణిజ్యానికి, మదుపునకు ఉత్తమ గమ్యస్థానంగా మారింది.
ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలను తెలుసుకుంటున్న ఏ వ్యక్తికైనా సరే, ఆర్థిక వ్యవస్థ ప్రాధమిక, సూక్ష్మ విభాగం కుటుంబమేనని చక్కగా బోధపర్చుకుంటాడు. ఈ కోణంలోంచి చూస్తే, ఆర్థిక వ్యవస్థను సంతోషకరంగా ముందుకు తీసుకుపోవాలంటే గృహ ఆర్థిక-కేంద్రక అభివృద్ధి చేపట్టడం చాలా ముఖ్యం. సామాజిక ఆర్థిక వ్యవస్థలోని అనేక అంతరాలు, విభజనలను కుటుంబాల సంతోషం, కుటుంబాల సౌభాగ్యం ద్వారానే చెరిపివేయవచ్చు. ఈ విభజనలను, హద్దులను ఎప్పుడైతే చెరిపివేయగలుగుతామో, అప్పుడే యావత్ సమాజం అంతర్గత ఘర్షణలనుంచి విముక్తి పొంది అభివృద్ధి, సంపద సృష్టి మార్గంలో ముందుకెళుతుంది. సరిగ్గా ఇలాంటి విభజన రేఖలను నిర్మూలించడం ద్వారానే ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు సీఎం యోగి నేతత్వంలో ముందుకెళుతోంది.
గృహ ఆర్థిక వ్యవస్థలో స్త్రీ శక్తే కేంద్రబిందువు అవుతుంది. కుటుంబం ఆర్జించిన ఆదాయాన్ని మహిళ సమర్థంగా నిర్వహిస్తుంది. కుటుంబ ఆహారం, విద్య, ఆరోగ్యంతోపాటు విభిన్న సామాజిక బాధ్యతలను సమన్వయం చేసి నియంత్రించే పెద్ద బాధ్యత మహిళలదే. కుటుంబ బాంధవ్యాలు ఏ అంశంలోనూ తెగిపోకూడదని, అవి ఎప్పుడూ పలుచన కాకూడదని ఇంటి మహిళ నిత్యం ఆందోళన పడుతుంటుంది. కాబట్టి ప్రభుత్వ పథకాలు నేరుగా కుటుంబంలోని మహిళకే అందినట్లయితే లేదా మహిళే వాస్తవార్థంలో లబ్ధిదారు అయినట్లయితే అప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థలో సామరస్యత, సున్నితత్వం ప్రభావవంతంగా ఉంటుంది. కుటుంబంలోని మహిళ స్వావలంబనవైపు నడిస్తే, కుటుంబమే ఒక యూనిట్‌గా బలిష్టంగా తయారవుతుంది. సాంస్కతికంగా కూడా అది మార్పు చెందుతుంది. దీని కారణంగా ప్రభుత్వానికి సామరస్యపూర్వక సమాజం కూడా మిత్రురాలిగా మిగులుతుంది.
ప్రధాని మార్గదర్శకత్వంలో యూపీ సీఎం యోగి ఒక సామరస్యపూర్వకమైన సమాజం కోసం ముందడుగు వెళుతూ వచ్చారు. కాబట్టే ప్రతిపక్షాలు కుల ప్రాతిపదికన సమాజాన్ని విభజించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. యూపీ ప్రజలు సీఎం యోగి అభివృద్ది, సంక్షేమ ప్రాతిపదిక ఆర్థిక నమూనాను, యోగిని విశ్వసిస్తూ ఆయనకు వరుస విజయాలు కట్టబెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి తీర్పు ఇచ్చారు. యోగి నమూనా మహిళ భద్రత, సాధికారత. స్వావలంబనలకు చెందిన త్రికోణాభివృద్ధి ఇప్పుడు యూపీలో తారకమంత్రమైపోయింది.