Wrestlers | లైంగిక వేధింపుల కేసు: భారత రెజ్లర్ల సంచలన నిర్ణయం

-

భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ గత కొంత కాలంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లు(Wrestlers) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ పోరాటం కోర్టుల్లోనే కొనసాగించాలని.. రోడ్లపై కాదని నిర్ణయించారు. ఈ మేరకు వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు సోమవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్ 7న జరిగిన చర్చల ప్రకారం ప్రభుత్వం మా డిమాండ్లను అమలు చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌(Brij Bhushan Sharan Singh)పై విచారణ జరిపిన తర్వాత ఢిల్లీ పోలీసులు జూన్ 15న కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. దీంతో ఇకపై మా పోరాటం కోర్టులో కొనసాగుతుంది తప్ప రోడ్లపై కాదని రెజ్లర్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే తాము సోషల్ మీడియా నుంచి కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు వినేస్ ఫోగాట్(Vinesh Phogat), సాక్షి మాలిక్(Sakshi Malik) ప్రకటించారు. రెజ్లర్లు(wrestlers) తమ ఆందోళన విరమించినట్లు చేసిన ప్రకటనపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు తన పని తాను చేసుకుపోతుందన్నారు.

- Advertisement -
Read Also:
1. ఒడిశాలో ఘోర ప్రమాదం.. పది మంది దుర్మరణం
2. రామ్ గోపాల్ వర్మకు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వార్నింగ్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...