దానం, ధర్మం, త్యాగం ఎప్పుడు చేయాలి? ఏ టైంలో చేయొద్దు : సూపర్ అనాలసిస్

donation sacrifice dharama ekalavya karna bhasmasura mahabali

0
119

తెలంగాణ ఉద్యమ నేత,  భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టులతో అదరగొడుతున్నారు. అద్భుతమైన విషయాలను తన అభిమానులకు పంచుతున్నారు. స్వతహాగా డాక్టర్ అయిన బూర… తన వృత్తిపరమై అంశాలనే కాకుండా ఇతరత్రా చైతన్యపరిచే అంశాలను కూడా తన అభిమానులకు షేర్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఫేస్ బుక్ వాల్ మీద షేర్ చేసిన ఒక పోస్టు అందరినీ ఆకట్టుకుంటున్నది.

రాజకీయాల్లో అయినా… దైనందిన జీవితంలో అయినా దానం, ధర్మం, త్యాగం లాంటివాటి విషయాల్లో ఎలా ఉండాలో వివరణాత్మక సందేశాన్ని ఉంచారు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. దాన్ని యదాతదంగా ఆల్ టైం రిపోర్ట్ సైట్ లో కింద ప్రచురించాము. అందరూ చదవండి… నచ్చిన వాళ్లు ఈ ఆర్టికల్ ను వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ట్సా లాంటి సోషల్ మీడియా వేదికల మీద షేర్ చేయగలరని ఆల్ టైమ్ రిపోర్ట్ వెబ్ సైట్ టీమ్ మీకు విన్నవిస్తోంది.

దానం, ధర్మం, త్యాగం గొప్ప గుణాలు. కానీ విచేక్షణ రహితమైన దానం, త్యాగం నీకు అనర్ధం కాకుండా జాగ్రత్తపడిలి . లేకుంటే దానం స్వీకరించిన వ్యక్తి నీ గొప్పతనం కాకుండా నిన్ను తెలివితక్కువ వాడుగా భావించవచ్చు, నీకు హానికల్గించవచ్చు. చరిత్రలో అనేక ఘట్టాలు ఉన్నవి.

ఏకలవ్యుడి దానం, తన నైపుణ్యానికి విఘాతం: ఏకలవ్యుడు కేవలం తన ప్రతిభతో అర్జునిడికంటే గొప్పగా విలువిద్య నేర్చుకున్నాడు. కానీ కపట ద్రోణుడు కేవలం అర్జనుడిని ఢీకొనే వాడు ఉండొద్దని, తాను చెప్పని, నేర్పించని విలువిద్యకు గురుదక్షణ పేరుతొ ఏకలవ్యుడి బొటనవేలు ఛేదించి, ఏకలవ్యుడిని నిర్వీర్యం చేస్తాడు. అంతటితో ఏకలవ్యుడి జీవిత అర్ధం అర్దాంతరంగా ముగుస్తుంది. ద్రోణాచార్యుడు ఏకవలవ్యుడిని తెలితక్కువ వాడిగా చూసాడు కానీ, కొనియాడలేదు. ఫలితం ఏకలవ్యుడి జీవితం ఈ లోకానికి, ఆ వర్గానికి ఒక చిహ్నాన్ని కోల్పోయింది. ఏకలవ్యుడి బొటన వేలు ఉంటె, కురుక్షేత్ర రణరంగం ఫలితం ఎలా ఉండేదో ?

కర్ణుడు: సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడి కవచ కుండలాలు ఇంద్రుడు కపట బుద్దితో కేవలం అర్జనుడికి ప్రాణహాని ఉండొద్దని బ్రాహ్మణ రూపంలో వచ్చి దానం రూపంలో తస్కరించాడు . ఆవే ఉంటె కర్ణుడికి కురుక్షేత్రంలో చావు ఉండకపోవు.

భస్మాసురుడికి వరం : బోలా శంకరుడు భస్మాసురుడికి వరమిచ్చి చివరకు తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు.

బలిచక్రవర్తి : ముల్లోకాలు జయించి ఎంతో అద్భుత పాలనా చేస్తున్న మహాబలి చక్రవర్తి కేవలం ఒక శూద్రుడు కావడం వలన, విష్ణువు ఒక బ్రాహ్మణా వామన రూపంలో వచ్చి, తన గురువు శుక్రాచార్యుడు వారించినా దానం ఇచ్చి, తాను బలిపశువు అయ్యాడు.

అందుకొరకు మనం చేసే ప్రతి దానం లేదా త్యాగం మనకు కీడు జరగకుండా చూసుకోవాలి. అది డబ్బు అయినా, లేదా ప్రజాస్వామ్యంలో ఓటు అయిన.