ఈ ఎయిర్ పోర్టు చూడడానికి రెండు కండ్లు చాలవు. చుట్టూ సముద్రం మధ్యలో విమానాశ్రయం. అక్కడ దిగితే ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు. గులాబీ పువ్వు ఎంత సుందరంగా ఉంటుందో కింద ముల్లు అంత ప్రమాదకరంగా ఉన్నట్లు ఈ ఎయిర్ పోర్టు కూడా అంతే. ఇది ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఎయిర్ పోర్టుల జాబితాలో చోటు దక్కించుకున్నది. ఇది మన ఇండియాలోనే ఉంది సుమీ… దీని గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంది కదా? అయితే చదవండి.
అగాటి ఏరో డ్రోమ్ అనే విమానాశ్రయం మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్ష ద్వీప్ లో ఉన్న ఏకైక విమానాశ్రయం. ఇది అందమైనది. ప్రమాదకరమైనది కూడా. ప్రపంచంలోని టాప్ టెన్ ప్రమాదకర విమానాశ్రయాల్లో ఇది చోటు దక్కించుకుంది.
కేరళలోని కోచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇక్కడికి చిన్న తరహా, తేలికపాటి విమానాలను నడిపిస్తుంటారు. ప్రపంచంలోని ప్రమాదకరమైన రన్ వే కలిగిన విమనాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడ రన్ వే మీద విమానాన్ని ల్యాండ్ చేయాలంటే పైలెట్ కు అపార అనుభవం ఉండాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే… ఇక్కడి విమానాశ్రయంలో ఇప్పటి వరకు భారీ ప్రమాదాలేమీ జరగలేదు.
అగాటి ఏరో డ్రోమ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పొడవు కేవలం 4 వేల అడుగులు మాత్రమే. ఇది నీటి మధ్యలో ఉండడంతో ఏమాత్రం తేడా వచ్చినా విమానాలకు ప్రమాదమే. అందుకే ఇక్కడ అత్యంత అనుభవం కలిగిన, నైపుణ్యం కలిగిన పైలెట్ లు విధుల్లో ఉంటారు.
ప్రపంచంలో ఇదికాకుండా మిగిలిన అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టుల ఏమిటో చూద్దాం.
కాంగోనాస్ ఎయిర్ పోర్ట్. ఇది బ్రెజిల్ లో ఉంది. బ్రెజిల్ లోని ప్రధాన నగరాల్లో ఒకటైన సావ్ పాలో లో ఉంది.
ప్రిన్సెస్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది సెయింట్ మార్టిన్ లో ఉంది. కరేబియన్ దీవుల్లో ఇది ప్రముఖ ఎయిర్ పోర్ట్.
కాయ్ తక్ ఎయిర్ పోర్ట్. హాంకాంగ్ లో ఉంది. ఇది ప్రమాదకరమైనది కావడంతో 1998లో మూసేసి మరోచోట కొత్త నిర్మించారు.
బీరా ఎయిర్ పోర్ట్. ఇది స్కాట్లాండ్ లో ఉంది. బీరా ద్వీపంలో ఉన్నది. ఇక్కడ బీచ్ ను కూడా రన్ వే గా ఉపయోగిస్తారు.
టాంకైంటీన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది హోండరూస్ దేశంలో ఉంది. మిలటరీ కార్యకలాపాలకు వాడతారు.
లాక్లా ఎయిర్ పోర్ట్. నేపాల్ లో ఉంది. సోలుఖుంబు జిల్లాలో ఉంది. 2008 లో దీన్ని హిల్లరీ విమానాశ్రయంగా పేరు మార్చారు.
వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఇది న్యూజీలాండ్ లో ఉంది. రన్ వే మొదట, చివర్లో నీటి కొలనులు ఉంటాయి.
కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది జపాన్ లోని సాకా బే సమీపంలో సముద్రం మధ్యలో కృత్రిమంగా నిర్మించినది.
కొప్రొవెల్ ఎయిర్ పోర్ట్. ఇది ప్రాన్స్ దేశంలోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. దీని రన్ వే పొడవు కేవలం 537 మీటర్లే.