ప్రస్తుత రోజుల్లో హెడ్ ఫోన్స్ వాడని వారు ఉండరు. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా కచ్చితంగా ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. చాలామంది పాటలు వింటూ ప్రయాణం చేస్తారు. అదికాక బయటకు వెళ్లినప్పుడు హెడ్ సెట్ లేకపోతే.. మనకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.
ఫోన్ లో ఏమైనా చూద్దాం అంటే.. సౌండ్ బయటకు వస్తుంది.. మనకు అది నచ్చదు. కాబట్టి కచ్చితంగా ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే.. కానీ వైద్యులు ఇలా హెడ్ ఫోన్స్ వాడొద్దని చెబుతున్నారు. బయటకు వచ్చే సౌండ్స్ విన్నప్పుడు.. కొంత సౌండ్ మాత్రమే మనకు వెళ్తుంది. కానీ హెడ్ ఫోన్స్ లాంటివి పెట్టినప్పుడు అది ఎంత అయితే వాల్యూమ్ వస్తుందో అంత మనలోకే వెళ్తుంది. కావున సౌండ్ డిస్టిబ్యూట్ కాకుండా కాన్సన్ ట్రేటెట్ ఫామ్ లో వెళ్లి అనేక సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
అలాగే హెడ్ పోన్స్ పెట్టుకోవడం వల్ల వయసులో ఉన్న పిల్లలకు 38 శాతం చెవుడు వచ్చేస్తుందని వాళ్లు కనుక్కున్నారు. అదికాక ఇయర్ డ్రమ్ కు బాగా వైబ్రేషన్ వచ్చేట్లు కొడతాయి.. ఇది చెవును బాగా ఇరిటేట్ చేస్తుంది.ఇంకాకొంత మంది ఇతరుల హెడ్ ఫోన్స్ వాడుతుంటారు.దానివల్ల చెవు ఇన్ఫెక్షన్ కు అవకాశం ఉందని వైదులు చెప్తున్నారు. చెవులువినబడకపోతే .. మన జీవితం సగం పోయినట్లే కదా. ఇయర్ డ్రమ్స్ ఎఫెక్ట్ అవడానికి ప్రధానంగా ఇయర్ ఫోన్స్ కారణం.