సులభంగా బరువు తగ్గాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి

0
114

ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు పెరిగి ఇబ్బంది పడుతుంటారు. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎంత బరువు ఉండాలో అంత బరువు మాత్రమే ఉండాలని.. వెయిట్ లాస్ అవ్వాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే మీరు కూడా త్వరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం కొన్ని ఇంటి చిట్కాలు. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా త్వరగా బరువు తగ్గుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వేడి నీళ్లు:

ఖాళీ కడుపున వేడి నీళ్లు తాగితే కూడా బరువు తగ్గొచ్చు. నిజానికి వేడి నీళ్లు తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. చూశారు కదా బరువు ఎలా తగ్గచ్చు అనేది. మరి ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి త్వరగా బరువు తగ్గండి. ఆరోగ్యంగా ఉండండి.

కరివేపాకు:

ధనియాల తో పాటు కొద్దిగా కరివేపాకు వేసి ఆ నీళ్లతో తీసుకుంటే కూడా బరువు త్వరగా తగ్గచ్చు. ఇది కూడా కొవ్వుని కరిగిస్తుంది.

ధనియాల నీళ్లు:

ధనియాల నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడానికి అవుతుంది. ఈ ధనియాల నీళ్లు కొవ్వుని కూడా కరిగిస్తాయి. అజీర్తి సమస్యలను కూడా పోగొడుతుంది.

అలోవెరా:

కలబంద ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల కూడా బరువు త్వరగా తగ్గచ్చు. రెండిటినీ సగం సగం తీసుకుని మిక్స్ చేసి దానిని తీసుకుంటే వెంటనే మీకు మార్పు కనబడుతుంది.

జీలకర్ర నీళ్లు:

జీలకర్ర నీళ్లు తాగితే కూడా బరువు తగ్గడానికి అవుతుంది. మెటబాలిజం ని బాగా ఉంచుతుంది. అదేవిధంగా ఒంట్లో ఉండే చెడు పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.