పాకిస్థాన్ లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి దేవాలయం – ఏమి దోరికాయో తెలిస్తే షాక్

పాకిస్థాన్ లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి దేవాలయం - ఏమి దోరికాయో తెలిస్తే షాక్

0
124

పాకిస్థాన్ మనకు దాయాదీ దేశం, అయితే ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి అనేలా మనం ఎన్నో కధలు చదివాం విన్నాం సినిమాలు కూడా అనేకమైనవి వీటి చుట్టు వచ్చాయి కూడా , అయితే పాకిస్ధాన్ లో ఇలాంటి కొన్ని ఆలయాలు శిదిలావస్దకు చేరుకున్నాయి, మరికొన్ని బాగానే ఉన్నాయి, అయితే ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూనే ఉంటారు…

చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు అనేకం దొరుకుతూనే ఉంటాయి.. ఇక గుప్త నిధులు కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి, అలాగే అనేక ఆలయాలు విగ్రహాలు కూడా బయటపడ్డాయి.తాజాగా పాకిస్థాన్లో అతిపురాతనమైన ఆలయం బయటపడింది… పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్ల నాటి పురాతన శ్రీమహావిష్ణువు ఆలయాన్ని గుర్తించారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఈ తవ్వకాల్లో దేవాలయంతో పాటు పలు విగ్రహాలు అలాగే ఆనాడు దేవుడికి ఇచ్చిన కొన్ని నగలు బయటపడ్డాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.

వాయవ్య పాకిస్థాన్లోని స్వాట్ జిల్లాలోబరీకోట్ ఘుండాయ్ దగ్గర పాకిస్థాన్ ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలకు తవ్వకాల్లో ఇవి కనిపించాయి, ఇవి హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశంగా పాలించిన కాలం నాటివి అని చెబుతున్నారు.. సుమారు క్రీస్తు శకం 850లో ఆలయం అని గుర్తించారు. వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు అధికారులు.