Telangana New Ministers | తెలంగాణ మంత్రుల జాబితాలో 11 మందికి చోటు..

-

Telangana New Ministers | తెలంగాణ మంత్రుల జాబితా గవర్నర్‌ తమిళిసై(Governor Tamilisai)కు అందింది. ఈ జాబితాలో డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క్, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరస్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ లకు చోటు కల్పించారు. కాసేపట్లో ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో మంత్రులకు నియమితులైన వారికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే ఫోన్లు చేసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

- Advertisement -

Telangana New Ministers | ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక(Priyanka Gandhi), జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి స్వాగతం పలకగా.. తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Read Also: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...