15 కిలోమీటర్ల జాతీయ జెండా..

15 కిలోమీటర్ల జాతీయ జెండా..

0
80

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జాతీయత ఉట్టిపడింది. పలు స్వచ్ఛంద సంస్థలు 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వసుధైవ్‌ కుటుంబం ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా 35 స్వచ్ఛంద సంస్థలు కలిసి 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ఏర్పాటు చేసి.. అమపార చౌక్‌ నుంచి పండిట్‌ రవిశంకర్‌ శుక్లా యూనివర్సిటీ వరకు ప్రదర్శించారు. ఈ 15 కి.మీ. పొడవునా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయా పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ జాతీయ జెండా ప్రదర్శన.. ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులోకి ఎక్కింది. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భగల్‌ పాల్గొని.. అమరులైన జవాన్ల కుటుంబాలను సత్కరించారు. ఆ రాష్ట్ర మాజీ సీఎంలు రమణ్‌ సింగ్‌, అజిత్‌ జోగి, కేబినెట్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.