ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2019 సంవత్సరం మరిచిపోలేని సంవత్సరం…. ఆయన ఈ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించారు… జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి ముందు రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు అవమాను ఎదుర్కున్నారు…
వాటన్నింటిని పట్టించుకోకుండా ప్రజా సేవే లక్ష్యంగా చేసుకుని ముందకు సాగారు… ప్రజాసంకల్పయాత్ర పేరుతో 2017-11-16న ఇడుపులు పాయాలో పడిన మొదటి అడుగు… ఆ డుగు వందలు వేళ లక్షల కోట్ల అడుగులుగా మారింది…. ఈ పాదయాత్రలో జగన్ కు ప్రజలు నీరాజనాలు పులుకుతూ నేరూగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ 3,648 కిలో మీటర్లు పాదయాత్ర చేసి చరిత్రలో నిలిచారు.
2019-01-09 పాదయాత్ర ముగిసింది.. ఎన్నికలు జరిగాయి 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాలను గెలిపించుకుని మరో సారి చరిత్రను తిరగరాశారు జగన్… 25 ఎంపీ సీట్లకు 22 గెలుచుకున్నారు… సీఎం అయిన తర్వాత జగన్ వ్యక్తిత్వమేమిటో ప్రజలకు తెలిసేలా చేశారు.
కంటివెలుగు, ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, మహిళలకు రక్షణగా దిశ యాక్ట్, దశలవారిగా మధ్యపాన నిషేదం, లక్షల్లో ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, వైఎస్సార్ కానుక ఇలా మరెన్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది జగన్ ఈ సంవత్సరంలోనే