ఆ నలుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవం చంద్రబాబుకు కత్తిమీదసామే

ఆ నలుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవం చంద్రబాబుకు కత్తిమీదసామే

0
38

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం టెన్షన్ టెన్షన్ గా ఉన్నారని రాజకీయ వర్గాలనుంచి సమాచారం… ఈ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితం కావడంతో టీడీపీ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది…

అయితే ఇప్పుడు ఈ హోదా కూడా కోల్పోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి… 23 మంది ఎమ్మెల్యేలలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ టీడీపీకి రాజీనామా చేశారు… ప్రస్తుతం గంట కూడా పార్టీకి దూరంగా ఉన్నారు… ఆయన తర్వాత మరో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని చూస్తున్నారట.

ఉత్తరాంధ్రనుంచి ఇద్దరు కోస్తానుంచి మరో ఇద్దరు ఉన్నారని తెలుస్తోంది… వారిలో ఒకరికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి… ఆయన కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి… ఈ నలుగురు వైసీపీలో చేరితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కోల్పోవడమే కాకుండా పార్టీ పరువు కూడా పోతుంది… అందుకే వారిని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడకు కత్తిమీద సామే అని అంటున్నారు మేధావులు..