”తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాని రెచ్చగొట్టి రాజకీయ లభ్ది పొందాలని చూస్తున్నారు. వీరిద్దరి డ్రామాలని ప్రజలు గ్రహించాలి” అని కోరారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. కృష్ణా జలాల వివాదంపై ఇరు రాష్ట్ర ముఖ్యనేతలు ప్రజలని రెచ్చగొడుతూ చేస్తున్న వ్యాఖ్యలని తీవ్రంగా ఖడించారు దాసోజు. ఈ అంశంపై శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు దాసోజు శ్రవణ్.
జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లోని కొందరు మంత్రులు, ఇటు కేసీఆర్ తోలుబొమ్మల్లా ఆడిస్తున్న కొందరు తెలంగాణ మంత్రులు ముష్టియుద్ధం చేస్తున్నారు. ప్రజలకు అతంత్య బావోద్వేగం కలిగించే అంశం నీళ్ళు. తెలంగాణ రాకమునుపు కూడా నీళ్ళ వాటా దక్కక, ప్రాజెక్ట్స్ పూర్తి గా అనేక ఇబ్బందులు తెలంగాణ సమాజం గురైయింది. అలాంటి సున్నితమైన అంశం విషయంలో ప్రజల మనో భావాలని రెచ్చగొట్టి రాజకీయ లభ్దిపొందాలనే కుట్ర ఇరు ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఇది దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా ఖడింస్తుంది.
”జల వివాదానికి కారణం ఎవరు ? ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు ? ఎవరి లబ్ది కోసం ఎవరు కుట్ర చేస్తున్నారు? అసలు ఈ వివాదంలో వాస్తవాలు ఏమిటి ? ఇవన్నీ ప్రజలకు తెలియాలి. గతంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి విందు చేసి రాయలసీమ సశ్యశ్యామలం కావాలని కోరిన మాట తెలంగాణ ప్రజలకి గుర్తుంది. జగన్ మోహన్ రెడ్డిని తప్పుపడుతున్న కేసీఆర్ 2019ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు పంపీ జగన్ ని గెలిపించిన మాట వాస్తవం కాదా ? సొంత కొడుకుని చుసుకున్నట్లు జగన్ ని చూసుకున్న కేసీఆర్ నేడు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు ? కాళేశ్వరం కట్టడానికి వీలు లేదని అడ్డు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇనాగిరేషన్ కి పిలిచి, ప్రాజెక్ట్ కట్టిన మంత్రి హరీష్ రావుని సైతం పక్కన పెట్టేసిన కేసీఆర్.. నేడు జగన్ తో ఎందుకు గొడవ పడుతున్నారు ? దండాలు పెట్టుకొని, స్వీట్లు తినిపించుకొని, ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని జగన్ తో ఆలయ్ బలయ్ చేసుకున్న కేసీఆర్ ,, ఈ రోజు ఎందుకు కయ్యానికి దిగారు ? దిని వెనుక వున్న మతలబు ఏంటి ? తెలంగాణ సమాజం ఈ డ్రామాని లోతుగా అలోచించాలి” అని కోరారు దాసోజు.
ఎవరి ధైర్యం చూసుకొని జగన్ మోహన్ రెడ్డి జల దాష్టికానికి పాల్పడుతున్నారు. జగన్ ధైర్యం వెనుక కేసీఆర్ వున్నారు. సొంత కొడుకుల చూసుకున్న కేసీఆర్ వున్నారనే ధైర్యంతోనే జగన్ మోహన్ రెడ్డి ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. తెలంగాణ సమాజం వీరి కుట్ర గమనించాలి. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు డ్రామాకు ఆడుతున్నారు. కేసీఆర్ పరిస్థితి రోజురోజు దిగజారిపోతుంది. దుబ్బాకలో ఓడిపోయారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయింది. సాగర్ లో వంద కోట్లు ఖర్చు చేసినా పదివేల మెజార్టీ రాలేదు. వీటన్నిటితో పాటు కొత్త టీపీసీసీ అధ్యక్షుడు వచ్చారు. తెలంగాణలో కొత్త బావోద్వేగం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమౌతున్న తరుణంలో ప్రజల బావోద్వేగాలని మరోసారి రెచ్చగొట్టి, హుజురాబాద్ లో ఓట్లు దండుకోవాలనే చిల్లరి ప్రయత్నంలో బాగంగా జల వివాదంని తెరపైకి తీసుకొచ్చారు” అని ఆరోపించారు దాసోజు.
”సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకి 3టీఎంసిల నీరు దోచుకుపోతున్నారు జగన్. శ్రీ శైలం 1885 ఫీట్ ఫుల్ ఫ్లో లెవల్ అయితే 795ఫీట్ వద్ద రంద్రం పెట్టి నీళ్ళు అన్యాయంగా దోచుకుపోతున్నారు. ఇది ఈనాటి మాట కాదు. జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సంగమేశ్వర లిఫ్ట్, రాయలసీమ ఎత్తిపొతలతో పాటు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విస్తరిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2019లో తీర్మానం చేశారు. మే 5 2020లో ప్రాజెక్ట్స్ లు కడతామని జీవో పట్టుకొచ్చారు. ఆగస్ట్ లో టెండర్లు పిలిచారు. ఇన్నాళ్ళు కేసీఆర్ గడ్డి పీకారా ? కేసీఆర్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఎక్కడికి వెళ్లారు ? నేడు ఎగిరెగిరి పడుతున్న తెలంగాణ మంత్రులు గత రెండేళ్ళుగా జలదోపిడీకి జగన్ కుట్ర చేస్తుంటే గుడ్డిగుర్రం పళ్ళుతోమారా ? మొద్దు నిద్రపోయారా ? కాంగ్రెస్ పార్టీ గొడవపడమని చెప్పడం లేదు. ప్రజాస్వామ్య బద్దంగా కేసీఆర్ పోరాటం ఎందుకు చేయాలేదు. జగన్ మోహన్ రెడ్డి జల దోపిడీ చేస్తున్నారని ఒక్క రోజైన పార్ల మెంట్ లో అడిగారా ? నిరసన తెలిపారా ? రెండున్నర ఏళ్లుగా దోపిడీ జరుగుతుంటే ఎందుకు మౌనంగా వున్నారు” ” అని నిలదీశారు దాసోజు
తెలంగాణ ఉద్యమమే నీళ్ళు నిధులు నియామకాల కోసం. తెలంగాణ వస్తే సశ్యశ్యామలమౌతామని తెలంగాణ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ గత ఏడేళ్ళుగా ప్రజల నోట్లో మన్నుకొట్టారు కేసీఆర్. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు, రాజీవ్ భీమా ప్రాజెక్ట్, కోయిల్సాగర్ ..2014 నాటికే యనబై శాతం పూర్తయిన ప్రాజెక్ట్సని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో చెప్పారు. రూ. 850కోట్లు కేటాయించినట్లయితే ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యేవి. కానీ వీటి పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పది వేల కోట్ల రూపాయిలతోటి జూరాల నుండి పాలమూరు ఎత్తిపోతల ఇరిగేషన్ కావాలని కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడితే .. నేడు ఇరవై శాతం కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. పది వేల కోట్ల రూపాయిలు వున్న ప్రాజెక్ట్ డబ్బ్బై వేల కోట్ల అంచనా పెంచేశారు తప్పితే ప్రాజెక్ట్ మాత్రం పూర్తి చేయలేదు. మహబూబ్ నగర్ ప్రజల నోట్లో కేసీఆర్ మన్నుకొట్టారు. జగన్ మోహన్ రెడ్డి దోపిడీ ని పక్కన పెడితే కల్వకుర్తి , నెట్టంపాడు, రాజీవ్ భీమా, కోయిల్సాగర్ కు కేటాయించిన మిగులు జలాల్ని కూడా వాడుకోవడం లేదు” అని వివరించారు దాసోజు.
”జగన్ మోహన్ రెడ్డి దోపిడీ చేయడానికి వీలు లేదు. ఇదే సందర్భంలో కృష్ణా జలాల దోపిడీ జరుగుతుందని డ్రామా ఆడుతున్న కేసీఆర్ ని కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తాం. ఏడేళ్ళుగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వున్న తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారు ? కల్వకుర్తి , నెట్టంపాడు, రాజీవ్ భీమా, కోయిల్సాగర్, దిండీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ ఎందుకు పూర్తి చేయలేదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి వుంటే జగన్ మోహన్ రెడ్డి నీటి దోపిడీకి పాల్పడినా కానీ మన ప్రాజెక్ట్స్ లో మనకి నీరు వస్తుండేవి. మనం పచ్చగా వుండే అవకాశం వుండేది. కానీ ఇక్కడే కేసీఆర్ కుట్రని అర్ధం చేసుకోవాలి. కేసీఆర్ కి తెలుసు. జగన్ మోహన్ రెడ్డి నీళ్ళ దోపిడీ చేయాలి. జగన్ దోపిడీ చేయడానికి వెసులుబాటు కల్పించింది కేసీఅరే. కల్వకుర్తి , నెట్టంపాడు, రాజీవ్ భీమా, కోయిల్సాగర్, దిండీ, పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ పూర్తయితే అసలు తెలంగాణకి జల వివాదమే వుండదు. కానీ వివాదాన్ని కూడా తన రాజకీయ లబ్ది కోసం వాడుకోవడానికి కేసీఆర్ చేసిన కుట్ర ఇదంతా ” అని ఆరోపించారు దాసోజు.
”కేసీఆర్ ఆ మధ్య కాలంలో గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా పరివాహక ప్రాంతలో డంప్ చేస్తామని మాట్లాడారు. ఇది కూడా ఓ పెద్ద కుట్ర. కాళేశ్వరం అయిపొయింది, ఏడేళ్ళుగా ప్రజల రక్త మాంసాలులతో దోచుకున్న ట్యాక్స్ సొమ్ము అంతా ఒక్క ఎకరాకి కూడా నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరం పేరుతో మింగేశారు. ఇప్పుడు కొత్త కుట్ర గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణలో కలిపే కుట్ర. దిని ద్వారా కొత్త ప్రాజెక్ట్స్ , కొత్త కాంట్రాక్టర్ కొత్త కమీషన్లు. ఇదంతా రాజకీయ , ఆర్ధిక సంబంధాలని బలపరుచుకోవడం కేసీఆర్, జగన్ ఆడుతున్న డ్రామా. దినిపై కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ” అని డిమాండ్ చేశారు దాసోజు.
”ఒకే దెబ్బకు రెండు పిట్టలకు గురి పెట్టారు కేసీఆర్ , జగన్. కేసీఆర్ తో గొడవపడి జగన్ మనికి నీరు తీసుకోస్తున్నాడని ఏపీ ప్రజలు అనుకోవాలి. ఇది జగన్ రాజకీయ లబ్ది. ఇటు నీళ్ళు దోపిడీ జరుగుతుంటే కేసీఆర్ ఊరుకుంటాడా ? అని తెలంగాణ ప్రజలు భావించాలి. ఇప్పటికే దిగజారిపోతున్న తన ఇమేజ్ ని జల వివాదంతో కాపాడుకోవాలి. ఇది కేసీఆర్ రాజకీయ లబ్ది. ఇక ఆర్ధిక లభ్ది విషయానికి వస్తే జగన్ కి రాయలసీమ ఎత్తిపోతల పధకం కొత్త కాంట్రాక్ట్, సంగమేశ్వరం కొత్త కాంట్రాక్ట్ , పోతిరెడ్డి విస్తీరణ కొత్త కాంట్రాక్ట్.. ఇవన్నీ జగన్ కి. ఇక్కడ జూరాల, గోదావరి ననుండి కృష్ణాకినీటి డంపింగ్ కొత్త ప్రాజెక్ట్స్ మళ్ళీ కమీషన్స్ కొట్టేయాలనేది కేసీఆర్ ఆర్ధిక లబ్ది. ఈ రకంగా చిల్లర రాజకీయానికి కేసీఆర్ పాల్పడుతున్నారు” అని విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం జల పంపిణీకి సంబధించి కొత్త ట్రబ్యునల్ ని ఏర్పాటు చేసుకునే అవకాశం వుంది. కానీ ఏడేళ్ళుగా కృష్ణా ట్రబ్యునల్ ని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ ఎందుకు విఫలమయ్యారు. బిజెపితో కుమ్మక్కయ్యారా ? మోడితో తలపడాలంటే భయమా ? చేతకాకపొతే కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నిక , రైతు చట్టాలు .. ఇలా అన్నిటికి బిజెపితో కలసి జై కొట్టిన కేసీఆర్ .. కృష్ణా ట్రబ్యునల్ ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు ? సుప్రీం కోర్టులో వేసిన కేసుని కూడా విత్ డ్రా చేసుకున్నారు. ఎవరి ఆదేశాలు మేరకు కేసుని విత్ డ్రా చేసుకున్నారో తెలంగాణ సమాజానికి కేసీఆర్ సమాధానం చెప్పాలి. ప్రజలని మోసం చేస్తూ జగన్, కేసీఆర్ డ్రామాలు ఆడుతుంటే బిజెపి తగిలించి తమాషా చూస్తుంది. ఈ ముగ్గురూ దోషాలు. ప్రజల బావోద్వేగాలు రెచ్చగొట్టె కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. దయచేసి జగన్, కేసీఆర్ ల చిల్లర రాజకీయలకు బావోద్వేగానికి గురి కావద్దు.” అని కోరారు దాసోజు.