ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల సంచలన కామెంట్లు

ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల సంచలన కామెంట్లు

0
95

ఎన్నికల ప్రచారంలో నంద్యాల ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున భూమా ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది ..అయితే భూమా వారసులుగా వీరు ఉన్నా, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు అనేది జరుగుతున్న చర్చ.. గతంలో మంత్రి అఖిల ప్రియ ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు.. అంతేకాదు వివాదాలు వద్దు మీరు కలిసి పనిచేయండి,పార్టీ తరపున మంచి గుర్తింపు ఉంటుంది అని తెలియచేశారు హామీ ఇచ్చారు ఇరువురికి.

ఎన్నికల ప్రచారంలో ఏవీ సుబ్బారెడ్డి తమకు దేవుడిచ్చిన మామ అని మంత్రి అఖిలప్రియ అన్నారు. అఖిలప్రియ మాట్లాడుతూ ఏవీ సబ్బారెడ్డి తమ వెంట లేకున్నా, టీడీపీ విజయానికి ఆయన కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చారని అన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధి అమ్మా నాన్నల కల అని ఆమె అన్నారు ఇక్కడ తమకు పెద్ద ఎత్తున ఇలా ఆహ్వనం ప్రజల నుంచి వస్తోంది అంటే. ఇదంతా అమ్మా నాన్న పై మీ ప్రేమ అని ఆమె తెలియచేశారు. మరోసారి చంద్రబాబును సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అయితే ఇలా ప్రచారంలో మామ పేరు వాడటంతో అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు., ఏవీకి అఖిలకు మధ్య ఇక విభేదాలు లేవు అని ఈ కామెంట్ తెలియచేస్తోంది అంటున్నారు ఇక్కడ జనం.