వైసీపీపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యాలు

వైసీపీపై అఖిలప్రియ సంచలన వ్యాఖ్యాలు

0
93

తమ కుటుంబానికి ఏం జరిగినా వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అఖిల ప్రియ అన్నారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… తన భర్త భార్గవ రామ్ పై అక్రమ కేసులు పెట్టారని అరోపించారు…

ఇటీవలే ఆళ్లగడ్డ పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంటి లేకుండా యూసుఫ్ గూడలో ఉన్న తన నివాసానికి వచ్చారని ఆమె మండిపడ్డారు… అందులో భాగంగానే జిల్లా ఎస్పీ తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు…

తన కుటుంబానికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు… ఈ ఎన్నికల్లో తాను ఓడిపోవడం మంచిది అయిందని అన్నారు… తాను ఓడిపోవడం వల్ల తనవారు ఎవరో అవతలి వారు ఎవరో తెలిసివచ్చిందని అన్నారు..