బాబుకు షాక్ వైసీపీలోకి భూమా అఖిల ప్రియ

బాబుకు షాక్ వైసీపీలోకి భూమా అఖిల ప్రియ

0
100

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో. ఏపీలో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుంచి చాలామంది బీజేపీ వైసీపీల్లో చేరిపోయారు…

ఇక రానున్న రోజుల్లో ఈ లీస్ట్ లోకి అఖిల ప్రియ కుటుంబం కూడా యాడ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు… అయితే జగన్ సర్కార్ మాత్రం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుంది… కాగా అఖిల ప్రియ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు…

ఆ తర్వాత అధికార ప్రలోభాలకు ఆశపడి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు… 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు… మళ్లీ ఇప్పుడు వైసీపీలో చేరాలని చూస్తున్నారట.