అన్నీ దేశాలు అడుగుతున్న ఆ ప్ర‌శ్నకి జవాబు చెప్పిన -డబ్ల్యూహెచ్‌వో

అన్నీ దేశాలు అడుగుతున్న ఆ ప్ర‌శ్నకి జవాబు చెప్పిన -డబ్ల్యూహెచ్‌వో

0
33

ఈ క‌రోనా విల‌య తాండ‌వం సృష్టిస్తోంది, ఇంత దారుణ‌మైన ‌విప‌త్తు ఈ మ‌ధ్య ప్ర‌పంచాన్ని వ‌ణికించింది లేదు.. రెండు ల‌క్ష‌ల‌మంది మ‌ర‌ణం అంటే, చిన్న విష‌యం కాదు.. 25 ల‌క్ష‌ల మందికి వైర‌స్ కోకింది, అయితే ఈ వైర‌స్ ని చైనాలో క‌నుగొన్నారు, కాని ఈ వైర‌స్ జంతువుల నుంచి వ‌చ్చిందా లేదా కొంద‌రు స్వార్ధ్యంతో త‌యారు చేసి బ‌య‌ట‌కు వ‌దిలిందా అనేది.

అన్నీ దేశాలు ప్ర‌శ్నిస్తున్న ప్ర‌శ్న… మొత్తానికి దీనిపై చైనా నుంచి మాత్రం ఒకే స‌మాధానం, ఇది జంతువుల నుంచి వ‌చ్చిన వైర‌స్ అని చెప్పారు, అయితే కొన్ని దేశాలు న‌మ్మ‌లేదు గ‌బ్బిలాల స్రావాల నుంచి వ‌చ్చిన వైర‌స్ అని డాక్ట‌ర్లు చెప్పారు..

అయితే తాజాగా డబ్ల్యూహెచ్‌వో దీనిపై క్లారిటీ ఇచ్చింది. .డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫదేలా చైబ్‌ జెనీవాలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జంతువుల నుంచి మనుషుల్లోకి వైరస్‌ ఎలా ప్రవేశించిందనే దానిపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు. గబ్బిలాల నుంచి అది మానవుల్లోకి చేరి ఉండొచ్చని ఫదేలా చైబ్ అభిప్రాయపడ్డారు. ఈ వైర‌స్ ల్యాబ్ లో త‌యారు కావ‌డానికి అవ‌కాశం లేదు అని మా ప‌రిశోధ‌న‌లో తేలింది అని చెబుతోంది డబ్ల్యూహెచ్‌వో.