ఏపీ ప్రభుత్వం శుభవార్త..10 రోజుల్లో దాన్యం డబ్బులు జమ..

0
97

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ రైతులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

రైతులకు వడ్ల ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల కల్లాల దగ్గరికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా పది రోజుల్లో దాన్యం డబ్బులు కూడా అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.

అలాగే ఏపీ లో రేషన్ బియ్యం సంబంధించి నగదు బదిలీ నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి తెలిపారు. బియ్యం బదులు నగదు ఇవ్వడంపై ఏదో కుట్ర ఉందని  ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో నగదు బదిలీ పై నిర్ణయం తీసుకొని స్పష్టం చేస్తామని తెలిపారు.