ఏపీ సర్కార్ బిగ్ డెసిషన్…పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు…ఇక నుంచి ఆ సర్టిఫికెట్ తప్పని సరి

-

కరోనా వైరస్ వ్యాధి మరింతగా పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పెళ్లిళ్లకు ఎంత మందిని అనుమతించాలనే విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పెళ్లిళ్ల అనుమతి విషయంలో కలెక్టర్ల అనుమతి పొందాల్సి వచ్చేది. దీని కారణంగా అనుమతులు ఆలస్యం అవుతుండటంతో ఇకపై ఈ వ్యవహారాలను తహశీల్దార్ కి అప్పగించింది.

- Advertisement -

ముఖ్యంగా జూలై 21 నుంచి శ్రావణ ప్రారంభం అవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న చేసుకుంటున్నారు. అయితే పెళ్ళిళ్ళకు మాత్రమే అనుమతి ఇవ్వాలని మిగతా ఎటువంటి ఫంక్షన్లకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొన్నది. పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువైపుల కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అనుమతి కోరే వారు తప్పనిసరిగా వివాహ శుభలేఖ తో పాటు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పై అఫిడవిట్ ను తహసీల్దార్ కు సమర్పించాల్సి ఉంటుంది…

దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పార్కు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లుగా వైద్యులిచ్చిన దృవ పత్రాలను జత చేయాలని ప్రభుత్వం జీవోలో తెలిపింది ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టంగా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...