రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త..కొత్త పథకం అమలు..పూర్తి వివరాలివే..

0
116

ప్రజలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా రైతులకు తీపి కబురు చెప్పింది. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారు.

రైతులకు సబ్సిడీపై యంత్రపరికరాలను అందేంచేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు, వారి పనులు వేగంగా పూర్తయ్యేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయ పడుతుంది. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. అద్దె ప్రాతిపదికన వ్యవహాయ యంత్ర పరికరాలను అందిస్తోంది. ఇప్పుడు మాత్రం రైతులకు స్వయంగా యంత్రాలను అందించాలని యోచనలో ఉంది.

ఈ మేరకు 50 శాతం సబ్సిడీతో రూ.403 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 కోట్ల అంచనా వ్యవయంతో ఆర్బీకే స్థాయిలోనే రూ.6లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల విలువైమ 10,750 వైఎస్ఆర్ యంత్రసేవా కేంద్రాలు, వరి ఎక్కువ పండించే ప్రాంతాల్లో రూ.10 లక్షల సబ్సిడీతో రూ.25లక్షలు విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన 1,615 క్లస్టర్ లెవల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల వ్యయంతో 6,781 రైతు భరోసా కేంద్రాలు, 391 క్లస్టర్ లెవల్ యంత్రసేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇటీవలై రైతు రథం పేరుతో రూ.175 కోట్లతో రూ.3,800 ట్రాక్టర్లను రైతులకు అందించిన అధికారులు, ఇప్పుడు పరికరాలను కూడా అందించనున్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి 20 మంది చొప్పున రైతులను ఎంపిక చేసిన ప్రభుత్వం మొత్తం లక్షా 80వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిచింది. అలాగే గ్రామానికి 8 మంది చొప్పున మొత్తం 80 వేల మందికి రూ.50వేల విలువన రెండు యూనిట్లను 50శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నారు..మొత్తం 403 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తుంది.