ఏపీ సర్కార్ తీపికబురు..వారికి రూ.10 వేల సాయం

0
123
CM Jagan

ఏపీ సర్కార్ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన జగన్ సర్కార్ వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌ ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

రేపు అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లకు ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్‌ రాజబాబు తెలిపారు. అలాగే వాహణాల ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, మరమ్మతుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

అర్హులైన వారికి వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చునని తెలిపారు. రేపు విశాఖలో లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లలో మొత్తం రూ.1,025.96 కోట్ల వ్యయం చేసిందని…ఈ సారి కూడా సాయం చేస్తున్నట్లు వివరించారు.