ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ… అయినా వెనకడుగువేయని సీఎం జగన్…

ఆర్థిక ఇబ్బందుల్లో ఏపీ... అయినా వెనకడుగువేయని సీఎం జగన్...

0
37

ఏపీ అర్థిక ఇబ్బందుల్లో ఉందని అందరికి తెలిసిందే… అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెనకడుగు వేయకున్నారు… తన తండ్రిలాగే పాలన సాగిస్తున్నారు… మాట ఇస్తే అది ఎంత కష్టమైనా నెరవేర్చాలనే దృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు… ఆదాయం లేకున్నా కూడా సంక్షేమ పథకాలను మాత్రం ఆపడటంలేదు…

సంక్షేమ పథకాలను ఎట్టిపరిస్థితో ఆపకూడదని అధికారులకు ఆదేశించారు… దీంతో నిధుల సేకరణకు అర్థిక శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు… వారికి లెక్క చూస్తుంటే చెమటలు పడుతున్నాయట… లాక్ డౌన్ లో ఉన్నా సీఎం జగన్ మాత్రం సంక్షేమ పథకాలను ప్రకటిస్తూనే ఉన్నారు…

ఇటీవలే సున్నా వడ్డీ డ్వాక్రా సంఘాలకు 1400 కోట్లు విడుదల చేశారు…. అలాగే రైతులను కూడా ఆదుకుంటున్నారు… దానితోపాటు వైద్య, విద్యా దీవేన కింద విద్యార్థులను ఆదుకుంటున్నారు… అలాగే చర్చి ఫాదర్లకు, ఇమామ్ లకు, అర్చకులకు 5వేలు ఇవ్వాలని ఆదేశించారు… మొత్తం మీద ఏపీ అర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను మాత్రం ఆపడంలేదు..