అయోధ్యలో రామాలయంలో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తారా? అంటే ఏమిటి?

అయోధ్యలో రామాలయంలో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తారా? అంటే ఏమిటి?

0
98

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఒక‌టే చ‌ర్చ అయోధ్య‌లో ఆగ‌స్ట్ 5న జ‌రిగే భూమి పూజ‌కి టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తున్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి…రామ మందిరం కింద 200 మీట‌ర్ల లోతులో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేస్తారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వాదనను ఆలయ ఫౌండేషన్ ఖండించింది.. టైమ్ క్యాప్సూల్‌ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. భూకంపాలు, తుఫానుల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా ఇది తట్టుకుంటుంది. వేల సంవత్సరాలు గడిచినా ఈ టైమ్ క్యాప్సూల్‌ చెక్కుచెదరదు. అది భూమిలోప‌ల ఉంటుంది, త‌ర్వాత ఏనాడు అయినా దీనిని తవ్విన స‌మ‌యంలో ఇక్క‌డ ఏముంది.

దాని చ‌రిత్ర ఇవ‌న్నీ కూడా అందులో ప‌త్రాల రూపంలో ఉంటాయి, అవి చెక్కు చెద‌ర‌కుండా త‌యారుచేస్తారు. చరిత్రను కాపాడటం, ఇప్పుడు ఏం జరిగిందో భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేయడమే, దీనికి ప్ర‌ధాన ఉద్దేశం.