టీడీపీ ఓడిపోతే రాష్ట్రం వదిలిపోతా.. మళ్ళీ టీడీపీ వస్తేనే అడుగుపెడతా

టీడీపీ ఓడిపోతే రాష్ట్రం వదిలిపోతా.. మళ్ళీ టీడీపీ వస్తేనే అడుగుపెడతా

0
140

ఎన్నికల ఫలితాలు మే 23 న వెలువడబోతున్నాయి.. ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రోజుకు సరిగ్గా 23 రోజులు మాత్రమే ఉంది.. అయితే ఎవరికీ వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులూ ప్రచారం చేస్తుంటే , జగన్ పార్టీ మాత్రం ఈ సారి అధికారంలోకి వచ్చేది తామే అంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటున్నారు..

ఇక జనసేన లో కొంత వైరాగ్యం నిండి ఉన్నా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాం అన్న సంతృప్తి లో ఉంది.. ఏదేమైనా ప్రజల నిర్ణయం తెలిసేది మాత్రం మే 23 న ఆరోజు రాబోయే 5 సంవత్సరాలు ఎవరి చేతిలో రాష్ట్ర పాలనా ఉంటుందో నిర్ణయించబడుతుంది..

ఇదిలా ఉంటే ఓ టీడీపీ బహిరంగ సవాల్ విసిరారు.. ఈసారి టీడీపీ తప్పక గెలిచి తీరుతుంది.. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఈసారి ఎపి లో ఉండను గాక ఉండను, మళ్ళీ టీడీపీ జెండా ఎగిరినప్పుడే మాత్రమే ఈ రాష్ట్రంలో అడుగుపెడతానని మంగమ్మ శపథం చేశారు.. దీన్ని బట్టి టీడీపీ శ్రేణుల్లో గెలుపు ధీమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు చంద్రబాబు, ఆయన తనయుడు కూడా టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్నారు..