బాబు సొంత జిల్లాలో జగన్ కీలక నిర్ణయం

బాబు సొంత జిల్లాలో జగన్ కీలక నిర్ణయం

0
94

తెలుుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు సొంత జిల్లాలని కూడా విస్మరించారు అనే విమర్శలు ఉన్నాయి.. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జిల్లాని కూడా అభివ్రుద్దిలో ముందుకు తీసుకుపోతున్నారు… తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు అన్నీ నెరవేరుస్తున్న జగన్ , మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాల్లో మెజారిటీ వాటాను స్థానికులకే కేటాయిస్తామని ప్రకటించిన జగన్, ఇప్పుడు దానిని అమలు చేసే పనిలో ఉన్నారు. అన్ని ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాల్సిందేనని జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానం
లోని ఉద్యోగాల్లో కూడా ఈ స్థానిక కోటాను అమలు చేయనున్నట్లుగా జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.

దీంతో చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఎక్కువ శాతం ఉద్యోగాలు తమకే వస్తాయి అని ఆనందంలో ఉన్నారు.. 75 శాతం ఉద్యోగాలు చిత్తూరు వాసులకు, 25 శాతం నాన్ లోకల్ కు బోర్డు ఉద్యోగాలు కేటాయిస్తుంది. ఇక వచ్చే కొత్త నోటీఫికేషన్ నుంచి దీనిని అమలు చేయనుంది టీటీడీ.