ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి వ్యతిరేకిస్తోంది.. అయితే చంద్రబాబు మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలి అని కోరుతున్నారు .ఇటు విశాఖ ఉత్తరాంధ్రా సీమ ప్రాంతాలలో ప్రజలు బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ సమయంలో చంద్రబాబు విశాఖ టూర్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు అని తెలుస్తోంది… టీడీపీ నేతలపై ఇప్పటికే ఈ మూడు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.. ఈ సమయంలో హిందూపురంలో బాలయ్యకు అక్కడ తీవ్ర వ్యతిరేకత చూపించారు ప్రజలు… ఇలా మూడు ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులకు తిప్పలు వస్తున్నాయి.
అయితే బాబు విశాఖ టూర్ కు ఈ సమయంలో వస్తే ఇబ్బందులు అని టీడీపీ నేతలు కూడా అంటున్నారు.. అందుకే బాబు విశాఖ టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారట, వచ్చే వారంలో బాబు కచ్చితంగా విశాఖ టూర్ ఉంటుంది అని అంటున్నారు.