బాలయ్య ఫోన్ కాల్ సంచలన నిర్ణయం తీసుకున్న కీలక నేత

బాలయ్య ఫోన్ కాల్ సంచలన నిర్ణయం తీసుకున్న కీలక నేత

0
94

నందమూరి వారసులు సినిమాలు అయినా రాజకీయాలు అయినా అందవేసిన చెయ్యి.. ముఖ్యంగా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య మరోసారి ఇక్కడ నుంచి పోటికి సిద్దమయ్యారు.. ఈసమయంలో పార్టీలో ముఖ్యంగా హిందూపురంలో ఎవరైనా అసంతృప్తులు ఉంటే వెంటనే వారిని వైసీపీలో చేర్చుకునేందుకు పక్కా ప్లాన్ వైసీపీ వేస్తోంది.. లేపాక్షి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు కొండూరు మల్లికార్జున పార్టీ వీడుతారన్న సమాచారం లేపాక్షిలో కలకలం రేపింది.. ఆయన కీలక నాయకుడు కావడంతో వెంటనే నాయకులు అందరూ కూడా షాక్ అయ్యారు.

తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదు అని, పార్టీ ఆవిర్బావం నుంచి టీడీపీలో ఉన్నా, తనతోపాటు నావెంట నడిచే నాయకులు, కార్యకర్తలకు సముచిత న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత వెంటనే ఈ విషయం బాలయ్యకు తెలిసింది. ఎన్నికల వేళ ఇలాంటి పరిస్దితి ఉండకూడదు అని వెంటనే బాలయ్య మల్లికార్జునతో మాట్లాడారు, నేను నీకు ఉన్నాను, నీకు పార్టీలో సుముచిత స్ధానం ఇస్తాను అని తెలియచేశారు. బాలయ్య ఫోన్ చేయడంతో ఇక ఆయన పార్టీ మారే నిర్ణయం విరమించుకున్నారట.