బాలయ్యకు తిరుగులేదు హిందూపూర్ లో వైసీపీ పూర్

బాలయ్యకు తిరుగులేదు హిందూపూర్ లో వైసీపీ పూర్

0
89

హిందూపురం కంచుకోట తెలుగుదేశం పార్టీకి అని చెప్పాలి.. ఇక్కడ బాలయ్యకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు… స్టేట్ అంతా బాలయ్య ఇక్కడ గెలవడు అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నా, మాకు ఇక్కడ బాలయ్య ఎమ్మెల్యేగా కావాలి అని, ఎవరో తెలియని వ్యక్తిని జగన్ ఇక్కడ ఎమ్మెల్యేగా తీసుకువచ్చారు అని ,. మాకు ఇళ్లులు వచ్చాయి పించన్లు వచ్చాయి అంటే బాలయ్య కారణం అని అంటున్నారు ఇక్కడ జనం.. బాలయ్య సినిమాలు చేస్తూ మా ప్రాంతం అభివృద్దికోసం కృషి చేస్తున్నారు అని ఇక్కడ నాయకులకు అప్పగించి పనులు దగ్గర ఉండి చేయించారు అని చెబుతున్నారు.

బాలయ్యకు హిందుపురంలో ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు ..ఎన్టీఆర్ ,హరి అన్న, బాలయ్య బాబు మీ ముగ్గురికి తిరుగులేని విజయాలు ఇచ్చిన గడ్డ మరోసారి విజయం కోసం పరితపిస్తోంది అంటున్నారు ఇక్కడ జనం.. బాలయ్య కూడా స్టార్ క్యాంపెయినర్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.. ఇక మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు సేవచేస్తాను అని, తన శక్తివంచన మేరకు అభివృద్దిచేసి చూపించాను అని అంటున్నారు హిందూపురం టీడీపీ అభ్యర్ది డైనమిక్ లీడర్ నటసింహం నందమూరి బాలయ్య… మరో వైపు ఆయన సతీమణి వసుంధరాదేవి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.