బాలయ్య మిస్సింగ్

బాలయ్య మిస్సింగ్

0
34

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడంలేదా… అంటే అవుననే అంటున్నారు అయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రజలు… హోరా హోరీగా జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి హిందూపురం నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు బాలయ్య…

అయన ఎమ్మెల్యే అయిన తరువాత చుట్టం చూపుగా ఒక్కసారి మాత్రమే హిందూపురానికి వచ్చారని ఆ తరువాత నుంచి అయన జాడ హిందూపురంలో కానరాలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు… అంతే కాదు ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా బాలయ్య జాడ కానరాలేదు…

ప్రస్తుతం అయన వరుస సినిమాల్లో బిజీ అయ్యారు… సినిమా షూటింగ్‌లంటూ ఆయన విదేశాలలో పర్యటిస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదు. దింతో హిందూపురం నియోజక వర్గంలో ప్రజలు కనీస అవసరాలకోసం నానా అగసాట్లు పడుతున్నారు.