సీఎం కేసీఆర్ పెద్ద గజదొంగ..బండి సంజయ్ ‘కౌంటర్లు’

0
96

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పెద్ద గజదొంగ అని..ఆయన పాలనలో సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణాలో తెలంగాణను నెంబర్ వన్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

ఆర్దిక నేరాల్లో నెంబర్ 2గా, వృద్దులపై దాడుల్లో నెంబర్ 3గా, రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 4గా తెలంగాణను మార్చారని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన, బీజేపీపైన విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్.వి.సుభాష్, పాల్వాయి రజనీ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో రాజకీయ గురువు ప్రొఫెసర్ జయశంకర్ ను కాలితో తన్ని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పులు మోయడానికి..చెప్పులు తీసివ్వడానికి మధ్య తేడా తెలియని మూర్ఖుడని విమర్శించారు.

రైతు సంఘాల నేతల సమావేశానికి రాష్ట్రంలోని రైతు సంఘాలను ఎందుకు పిలవలేదు? కాంగ్రెస్ తో పాటు ఎర్ర గులాబీలైన కమ్యూనిస్టు పార్టీలకు చెందిన రైతు సంఘాలు కూడా ఉన్నయ్ కదా… వాళ్లనెందుకు పిలవలేదు?

ఆ సమావేశంలో రుణ మాఫీ ఎందుకు అమలు చేయలేదో చెప్పినవా? వరి వేస్తే ఉరే అని నేనే మొరిగిన..ఫాంహౌజ్ లో మాత్రం వరి వేసి నేను లాభపడ్డానని.

రైతుల ఆత్మహత్యలు విచ్చల విడిగా జరుగుతున్నయ్.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన వాళ్లకు నయా పైసా ఇయ్యలే.. పంజాబ్ పోయి రైతులకు మాత్రం రూ. 3 లక్షలిచ్చినవని చెప్పవైతివి. తెలంగాణ ప్రజలకు చెల్లని రూపాయిగా మారిన సంగతి చెప్పవైతివి..

నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్ ప్రకారం… సైబర్ నేరాల్లో, మానవ అక్రమ రవాణాల్లో, దళితులను అవమానపర్చడంలో నెంబర్ వన్… వన్…వన్, ఆర్దిక నేరాల్లో నెంబర్ 2, వ్రుద్దులపై దాడుల్లో నెంబర్

రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 4… ఇదీ కేసీఆర్ సాధించిన ఘనత..

కేసీఆర్ పిచ్చి పీక్ స్టేజీకి పోయింది. కేసీఆర్ కుటుంబ అక్రమ దందాలన్నీ బయటపడుతున్నయ్..

లిక్కర్ దందా విషయంలో కేసీర్ బిడ్డ మీడియాకు ఎక్కి ఉన్న పరువు పోగొట్టుకుంది.

చినుకులు పడితే సత్యం చెబుతున్నట్లా? మరి ఆయన మాట్లాడిన వందల సభల్లో చినుకులే పడలే.. ‌ఈ లెక్కన ఆయన అన్నీ అబద్దాలు చెప్పినట్లే కదా..

ఎన్నికల హామీలన్నీ ఎటుపోయినయ్. … రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాలు, దళిత సీఎం వంటి హామీలన్నీ ఎటుపోయినయ్.. తెలంగాణ ప్రజలు ఎందుకు దుర్భర జీవితాలు గడుపుతున్నరు?

సీఎం… నువ్వు పోలీస్ బందోబస్తు లేకుండా పాదయాత్ర చెయ్.. ప్రజల సమస్యలు తెలుసుకుంటే… మాకీ బాధ ఎందుకు? నువ్వు పాదయాత్ర స్టార్ట్ చేస్తే.. నేను పాదయాత్ర బంద్ చేస్తా… నేను 4వ ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12న స్టార్ట్ చేస్తున్నా… నువ్వు ఆరోజు పాదయాత్ర స్టార్ట్ చెయ్.. నేను బంద్ చేస్తా… నువ్వు తిరగవు. మేం తిరిగితే తట్టుకోలేకపోతున్నవ్…

ఒక సీఎంగా ఉంటూ ప్రజల కోసం ఏం చేశావో చెప్పకుండా… అధికారిక కార్యక్రమాలకు పోయి ప్రధానమంత్రిని తిడతావా? మేం అభివ్రుద్ధి గురించి మాట్లాడితే.. సీఎం కుటుంబం మతం గురించి మాట్లాడుతున్నడు… ఏమైనా అంటే మోదీగారికి మీటర్ పెట్టాలట… నీకే తెలంగాణ ప్రజలు మీటర్ పెట్టబోతున్నరు బిడ్డా…

నువ్వే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నవ్. ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టాలనుకుంటున్నవ్? బిడ్డా.. మోటార్లకు మీటర్లు పెడితే నిన్ను గ్రామాల్లో తిరగనీయం.

లిక్కర్ స్కాం విషయంలో నీ ట్విట్టర్ టిల్లు ఎటు పోయిండు? మా పాత్ర ఏమీ లేదని నీ కుటుంబం ఎందుకు చెప్పడం లేదు? చీకోటి ప్రవీణ్ క్యాసినో, లిక్కర్ దందా, డ్రగ్స్, ఇసుక, మైనింగ్ దందాలన్నీ మీవే..

మానవ అక్రమ రవాణా కేసీఆర్ కు ఇష్టమైన వ్యాపారం. ఆయన పాస్ పోర్ట్ బ్రోకర్ గా ఉంటూ చేసిన పని అదే… అందుకే ఇయాళ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అందుకే నెంబర్ వన్ అయ్యింది తెలంగాణ అక్రమ రవాణాలో

నువ్వు మోడీని దొంగని తిడతవా?.. నువ్వో గజదొంగవు. నీ దోపిడీ బయటపడుతోంది. నీ పాపాల పుట్ట పగులుతోంది.

మద్యంతో ఏరులై పారిస్తున్న నువ్వు ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడతావా? బెల్టు షాపుల్లో చీప్ లిక్కర్ తాగే ఆరోగ్యంగా ఉంటదా? తాటిచెట్ల వద్ద డ్రంకన్ డ్రైవ్ పెట్టి కల్లుగీత కార్మికుల పొట్ట కొడతవా?

పెద్దపల్లి సభకు జనాన్ని తరలించేందుకు ప్రైవేటు స్కూళ్లను బెదిరించి బస్సులన్నీ తరిలించిండు. పెద్దపల్లి స్కూళ్లను బంద్ పెట్టిండు.

సింగరేణిని నాశనం చేసింది నువ్వే… 2‌0 వేల ఉద్యోగాల కోత పెట్టింది నువ్వే.. కార్మికుల పొట్ట కొట్టింది నువ్వే.. సంస్థను బొందల గడ్డగా మార్చింది నువ్వే… సింగరేణి నుండి 20 వేల కోట్ల రూపాయలు తీసుకుని సంస్థను దివాళా తీయించింది నువ్వే. ఇయాళ ఉద్యోగులకు బ్యాంకు నుండి అప్పులు తెచ్చి జీతాలిచ్చే దుస్థితికి సంస్థను చేర్చింది నువ్వు కాదా?

కేసీఆర్… నీకు చేతనైతే తెలంగాణలో చేసిన అభివ్రుద్ధి ఏమిటి? నువ్వు చేసిన అప్పులెన్ని? కేంద్రం ఇచ్చిన నిధులెన్ని లెక్కలు చెప్పు.. ఆ తరవాతే రాజకీయాలు మాట్లాడు. నువ్వు మోడీని తిట్టేంత గొప్పోడివే.. ప్రపంచమంతా మోదీని పొగుడుతుంటే.. నువ్వు తిడతవా?

దేశంలో ఎక్కడ స్కాం బయటపడ్డా నీ కుటుంబం పేరే విన్పిస్తోంది. ప్రజలంతా ఛీ కొడుతున్నరు. వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ తరువాత చివరకు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ కుటుంబ అవినీతి గురించి చర్చించుకుంటున్నరు.

చెప్పులు మోయడానికి… తీసివ్వడానికి తేడా తెలియని మూర్ఖులు వాళ్లు… నీ లెక్క తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జయశంకర్ లాంటి వాడిని కాలితో తన్నే రకం నాది కాదు.. నీకు గురువు పట్ల సంస్కారం లేదాయే..

వావివరసలు తెల్వని మూర్ఖత్వపు కుటుంబం మీది. మాకు అమిత్ షా రాజకీయ గురువు. పెద్దలను గౌరవించడం మా సంస్ర్కతి. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన వీరుడు అమిత్ షా… నువ్వు ఆనాడు ప్రధాని వద్దకు పోయి వంగి వంగి సలాం చేసిన సంగతి మర్చిపోయినవా? పాదయాత్రలో ఎంతోమంది చెప్పులు రోడ్డుపై పడితే తీసిచ్చిన.. అంతమాత్రాన చెప్పులు మోసినట్లా? అయినా నీ లెక్క అందితే కాళ్లు.. అందకపోతే జుట్టు పట్టుకునే రకం మాది కాదు..

మీడియా అడిగిన ప్రశ్నకు… కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మేం అడిగినం… వాళ్లు ఏ తప్పూ చేయకపోతే… శుద్ధ పూసలైతే అనుమతి ఇవ్వు. మేం వెళ్లి సందర్శించి వస్తం…

లిక్కర్ దందాలో మా కుటుంబ ప్రమేయం లేదని ఎందుకు చెప్పడం లేదు? వాళ్లే కోర్టుకు పోయిండ్రు కదా…