మంగళగిరిలో ఆర్కేకి ఊహించని షాక్

మంగళగిరిలో ఆర్కేకి ఊహించని షాక్

0
85

తామే గెలుస్తాం మా గెలుపు ఫైనల్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు..దీనికి సాక్ష్యాలుగా తమకు వచ్చిన సర్వేలు రిపోర్టులు చూసి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీనేతలు మాత్రం ఓపికగా సహనంగా ఉంటున్నారు… కేంద్రంలో ఉన్నమోదీ ఈసీ సాయంతో ఇలా వైసీపీ విర్రవీగుతోంది అని విమర్శలు కూడా వస్తున్నాయి.. తాజాగా తెలుగుదేశం పార్టీనేతలు కూడా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మంగళగిరిలో ఈసారి మంత్రి నారాలోకేష్ పోటీ చేశారు.. ముందు నుంచి కూడా నారాలోకేష్ ని డీగ్రేడ్ చేయాలి అని భావించారు.

అందుకే నారా లోకేష్ పై పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు.. అయితే ఆయన మాత్రం ఏమీ పట్టించుకోలేదు.. అసలు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా లోకేష్ పై చేసిన ట్రోలింగ్ మరేవరిపై చేయలేదు అని చెప్పాలి.. ఐటీ మంత్రిగా ఉన్నా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. పోనిలే అని వదిలేశారు.. అయితే ఇప్పుడు జగన్ ఎలాగైనా లోకేష్ ని ఓడించాలి అని ప్లాన్ రచించారు. అందులో భాగంగా జగన్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్కేకి సాయం చేశారు. అక్కడ విజయసాయిరెడ్డి గుంటూరుకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త ఆర్కేకి సాయం చేశారట.

ఇప్పుడు అక్కడ ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఓటుకి వేల రూపాయలు ఇచ్చారు వైసీపీ నేతలు అని విమర్శలు కూడా వస్తున్నాయి. కాని తాజాగా వచ్చిన గుంటూరు జిల్లా రిపోర్టులో లోకేష్ 3500 నుంచి 4200 ఓట్ల మెజార్టీతో గెలుస్తారట.. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలకు ఆందోళన మొదలైంది. అసలుఎక్కడ ఏ సర్వే చూసినా అన్నీ వైసీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు.. కాని తాజాగా వచ్చిన జిల్లా సర్వేలో లోకేష్ గెలుస్తారు అని తెలియడంతో ఆ అభ్యర్ది కూడా డైలమాలో ఉన్నారట.