దగ్గుబాటి మాస్టర్ ప్లాన్ బాబుకు షాక్ తప్పదా

దగ్గుబాటి మాస్టర్ ప్లాన్ బాబుకు షాక్ తప్పదా

0
66

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తెలియని వారు ఉండరు.. సీనియర్ ఎన్టీఆర్ అల్లుడు గా ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద అల్లుడిగా ఆయనకు పేరు ఉంది. ఇక ఎన్టీఆర్ ని పార్టీ నుంచి పదవీచిత్యుడ్ని చేసిన చంద్రబాబు వెంట ఆనాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు.. ఈ సమయంలో టీడీపీని బాబు హస్తగతం చేసుకున్నారు. అంతేకాదు సీఎంగా చంద్రబాబుని చేయడం వెనుక ఆయన పాత్ర కూడా ఉంది. అయితే తర్వాత ఇద్దరికి చెడిపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీనుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ లో చేరిపోయారు. బాబుమోసాలపై పుస్తకాలు రాశారు. రాజకీయంగా ఉనికి కోల్పోయారు . కాని తాజాగా ఆయన చరిష్మా మళ్లీ పెరుగుతోందట. ఇక చంద్రబాబు మూడుసార్లు సీఎం అయితే దగ్గుబాటి మాత్రం ఒకసారి మంత్రిగా ఉన్నారు, కాని ఈసారి రాజకీయ పరిస్ధితులు మారనున్నాయి అని తెలుస్తోంది. పర్చూరు నుంచి ఆయన కుమారుడు హితేష్ పోటీ చేస్తారు అని అందరూ భావించారు. కాని అతని అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో ఈసారి ఆయనే నేరుగా పోటీలో ఉన్నారు.

ఇక ఆయన జగన్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుంది అని, ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. కాని ఆయనకు స్పీకర్ పదవి ఇవ్వనున్నారట జగన్ ..ఈ సమయంలో చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెట్టనున్నారట జగన్, ఇక స్పీకర్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉంటే కచ్చితంగా తోడల్లుడు అయిన దగ్గుబాటిని అధ్యక్ష అని సంభోదించాలి ..మరి వైరి వర్గంగా ఉన్నచంద్రబాబు ఎలా పిలుస్తారు అని ఇటు చర్చ అయితే జరుగుతోంది. ఇలా దగ్గుబాటితో జగన్ మాస్టర్ ప్లాన్ వేశారట. మరి ప్రతిపక్ష నేత ఒప్పుకోవాల్సిందే. కాదు అంటే కుదరదు మరి జగన్ ఆలోచన ఎలాంటి పరిస్దితులకు దారి తీస్తుందో చూడాలి.