గంటాకు మరో బిగ్ షాక్…

గంటాకు మరో బిగ్ షాక్...

0
38

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కీలక అనుచరుడు నలంద కిశోర్ మృతి చెందారు… కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నలందకిశోర్ తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు…

కాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన అనుచిత పోస్ట్ చేశారనే ఉద్దేశంతో సీఐడి అధికారులు మూడు వారాల కిందట అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో కర్నూల్ జిల్లాకు తరలించారు… అక్కడ వైద్య పరీక్షలు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు… అతన్ని విచారించిన తర్వాత తిరిగి వదిలేసింది…

ఆతర్వాత నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదు… అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు… కాగా నలంద కిశోర్ అరెస్ట్ సమయంలో గంటా శ్రీనివాస్ వైసీపీ సర్కార్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే… తన అనుచరులను కాదని తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు…