బిగ్ బ్రేకింగ్ – ఏపీలో మరికొన్ని లాక్డౌన్ మినహాయింపులిచ్చిన సీఎం జగన్

బిగ్ బ్రేకింగ్ - ఏపీలో మరికొన్ని లాక్డౌన్ మినహాయింపులిచ్చిన సీఎం జగన్

0
98

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ కొనసాగుతుంది, ఈ సమయంలో ఏపీలో కూడా లాక్ డౌన్ అమలు అవుతోంది.. కేంద్రం ఇచ్చిన సడలింపులతోనే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు, అలాగే ఏపీలో పలు సడలింపులు ఇచ్చింది వైయస్ జగన్ సర్కార్..

ఈ సమయంలో రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది. ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులను ప్రకటించింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. రెడ్ జోన్లు కంటైన్మెంట్లలో మాత్రం ఈ వాహనాలు తిరగడానికి వీలు లేదు.

ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతిచ్చారు. కచ్చితంగా అందరూ మాస్క్ ధరించాలి,ఇందులో శానిటైజర్లు కూడా వాడాలి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సైతం రోడ్డెక్కాయి. అటు స్ట్రీట్ వెండర్స్కు కూడా జగన్ సర్కార్ షరతులతో పర్మిషన్ ఇచ్చింది, అన్నీ దుకాణాలు తెరచుకున్నాయి.బట్టలు, నగలు, చెప్పుల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు, కాని పానీ పూరీ బండ్లకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే బస్సులు నడుపుతామని చెబుతున్నారు అధికారులు.