బిగ్ బ్రేకింగ్ కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు

బిగ్ బ్రేకింగ్ కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు

0
92

దేశంలో వైరస్ తీవ్రత మరింత పెరుగుతోంది, ఈ సమయంలో సడలింపులు ఇచ్చిన కేంద్రం జాగ్రత్తలు కూడా చెబుతోంది, బయటకు ఎవరూ రాకుండా వైరస్ బారిన పడకుండా ఉండాలని అవసరం అయితేనే బయటకు రావాలని చెబుతున్నారు, అయితే ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలులోనే ఉంటుంది.

ఇక తాజాగా మరిన్ని మార్గదర్శకాలు ఇచ్చింది కేంద్రం. ఆఫీసులకి వెళ్లేవారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా ఉండాలి.
కంటైన్ మెంట్ జోన్ దగ్గర ఉన్న వారు ఎవరూ కూడా ఆఫీసులకి రాకూడదు.. రోజుకు 20 మంది మాత్రమే ఆఫీసులకు రావాలి. మిగిలినవారు వర్క్ ఫ్రం హోం చేయాలి.

ఇక ఆఫీసుల్లో పని చేసే వారు కచ్చితంగా మాస్క్ ధరించాలి, ఆఫీసుల్లో శానిటైజర్లు వాడాలి, అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చి చేతికి స్టాంప్ ఉండగా క్వారంటైన్ రూల్ ఉంటే వారు ఎక్కడకి వెళ్లకూడదు, ఇంటిలోనే 14 రోజులు ఉండాలి, ఈ రూల్స్ అతిక్రమించకూడదు.