బిగ్ బ్రేకింగ్ …లోకేష్ కు కొత్త టీచర్ నిజమేనా

బిగ్ బ్రేకింగ్ ...లోకేష్ కు కొత్త టీచర్ నిజమేనా

0
86

తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి లోకేష్ ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు.. కాని తెలుగులో మాత్రం కాస్త తడబడతారు ..అయితే ఐదేళ్లు అయిపోయింది వారి పాలన పూర్తి అయి.. కాని ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఎలాంటి కొత్తదనం తన ప్రచారంలో చూపలేకపోయారు లోకేష్, గతంలో ఆయనకు తెలుగు నేర్పించేందుకు పెద్ది రామారావుకు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది.

లోకేశ్ ప్రసంగాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు సూచించారు ఆయన, అయితే ఇప్పుడు ఎలాంటి మార్పు రాకపోవడంతో మరోసారి మరో టీచర్ తో ఇప్పుడు తెలుగుపై క్లాస్ ఇవ్వనున్నారట…తెలుగులో రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ను టీడీపీ అధినేత సంప్రదించారని వార్తలు వస్తున్నాయి.

ఆయన అనేక నవలలు రాశారు అయితే ఇప్పుడు ఆయన…వ్యక్తిత్వ వికాసనిపుణుడిగా ఉన్నారు. ఆయన స్పీచ్ ఇవ్వడంతో చాలా నేర్పరి … మరి తాజాగా లోకేష్ కు ఆయనే స్పీచ్ ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి తెలుగు పదాలు ఉచ్చరించాలి అనేది ట్రైనింగ్ ఇవ్వనున్నారట.