బోస్టర్ కమిటీపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

బోస్టర్ కమిటీపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

0
83

బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ కమిటీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు… బీసీజీ కమిటీకి తలా తోకా ఉందా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ….విజయసాయిరెడ్డి అల్లుడు ఇచ్చిన రిపోర్ట్ ను పట్టుకుని బీసీజీ అంటున్నారని చంద్రబాబు ఆగ్రహం చెందారు…

బీసీజీలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు… ఆయన చెప్పినట్లు రిపోర్ట్ తయారు చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు… బీసీజీ క్లయింట్ ఏది కావాలో అదేరాసిందని అన్నారు.. ఎవరిని మోసం చేయడానికి బీసీజీ కమిటీని నియమించారని చంద్రబాబు ప్రశ్నించారు..

మూడు రాజధానులు చేయడానికి అధికారం ఎవరిచ్చారని అన్నారు… విశాఖలో హుదూత్ కు ముందు ఆ తర్వాత ఎందుకు ప్రస్తావించలేదని అలాగే కర్నూల్ వరదల గురించి ఎందుకు ప్రస్థావించలేదని చంద్రబాబు ప్రశ్నించారు…