బ్రాహ్మణి పోస్ట్ చూసి తట్టుకోలేక వైసీపీ గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతాన్న లోకేశ్

బ్రాహ్మణి పోస్ట్ చూసి తట్టుకోలేక వైసీపీ గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతాన్న లోకేశ్

0
82

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మమైన అమ్మఓడి పథకాన్ని ప్రారంభించారు… ఈ పథకం ద్వారా అర్హులు అయిన ప్రతీ ఒక్క తల్లికి 15 వేలు నేరుగా వారి అకౌంట్లలో జమ చేసింది వైసీపీ సర్కార్…

అయితే ఈ అమ్మఒడిపథకం ద్వారా టీడీపీ నేత నారాలోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా 15 వేలు అకౌంట్లో పడ్డాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది దీనిపై లోకేశ్ స్పందించారు…

మీ పిచ్చి డ్రామాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు వేసుకోండి, నా దగ్గర కాదని హెచ్చరించారు. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సైలెంట్ గా ఉంటే మంచిదని అన్నారు. మార్ఫింగ్ చేసి తప్పుడు పనులు చేస్తే జగన్ దొంగ బతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతానని హెచ్చరించారు లోకేశ్. ఈరోజు శుక్రవారం మీ డప్పు అక్కడ కొట్టుకోండిని అన్నారు..

5 రూపాయల ముష్టికోసం వైకాపా పేటీఎమ్ బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు… అమ్మ ఒడి అని బొమ్మ చూపించారని ఎద్దేవా చేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 6 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రతి బిడ్డకి అమ్మ ఒడి అన్నారు ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటా అర్హుల సంఖ్య సగానికి కోసారు లోకేశ్ అన్నారు…