బ్రేకింగ్ ఏపీలో స్కూల్స్ తెర‌చుకునే తేది చెప్పేసిన సీఎం జ‌గ‌న్

బ్రేకింగ్ ఏపీలో స్కూల్స్ తెర‌చుకునే తేది చెప్పేసిన సీఎం జ‌గ‌న్

0
93

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, అయితే ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు జ‌రుగ‌క విద్యార్దులు ఇబ్బంది ప‌డ్డారు, అయితే ప‌దో త‌రగ‌తి ప‌రీక్ష‌ల‌పై ఎప్పుడు నిర్వ‌హించేది ఆయా రాష్ట్రాలు కొత్త షెడ్యూల్స్ చెబుతున్నాయి, అయితే ఏపీలో కూడా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించారు, ఇక 1 నుంచి 9 వ‌తర‌గ‌తి స్టూడెంట్స్ ని నేరుగా త‌ర్వాత త‌ర‌గతులకి ప్ర‌మోట్ చేశారు.

మ‌రి ఈ లాక్ డౌన్ వేళ ఎప్పుడు స్కూళ్లు ప్రారంభం అవుతాయి అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు, ఈ స‌మ‌యంలో ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది, ఏపీలోఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు.

తాజాగా ఏపీలో చ‌క చ‌కా అన్నీ రంగాల‌కు స‌డ‌లింపులు ఇవ్వ‌డ‌మే కాదు… విద్యార్ధుల భ‌విష్య‌త్తు ఆలోచించి అక‌డ‌మిక్ ఇయ‌ర్ దెబ్బ‌తిన‌కుండా స్కూల్స్ స్టార్ట్ చేయాలి అని భావిస్తున్నారు, ఇక ప్ర‌తీ స్కూల్లో 9 ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించాలి అని చెప్పారు. జూలై నెలాఖ‌రున అన్నీ ప‌నులు పూర్తి చేయాలి అని తెలిపారు సీఎం జ‌గ‌న్.