బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు గీసిన గీతను దాటేందుకు సిద్దమైన 8 మంది ఎమ్మెల్యేలు..

బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు గీసిన గీతను దాటేందుకు సిద్దమైన 8 మంది ఎమ్మెల్యేలు..

0
124

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది… 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు… ఇక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్ గా మారిన సంగతి తెలిసిందే…

ఇక రానున్న రోజుల్లో మరికొందరు టీడీపీని వీడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.. ఇక 2024 నాటికి ఎంతమంది మిగులుతారో అన్న చర్చ జరుగుతోంది… తాజా విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో 20మంది ఎమ్మెల్యేల్లో సుమారు ఏడు లేదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గీసిన గీతను దాటేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

సార్వత్రిక ఎన్నికల నాటికి కేవలం 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని వార్తలు వస్తున్నాయి వారితోనే చంద్రబాబు నాయుడు తన రాజకీయాన్ని కొనసాగించాలని చూస్తున్నారట… ఒకవేళ ఈ వార్త నిజం అయితే ఎన్నికల సంగతి పక్కన పెడితే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షహోదా కోల్పోయే ఛాన్స్ ఉంది..