బ్రేకింగ్ — దేశంలో కరోనా కేసులు కొత్త రికార్డ్ ఒక్క రోజు ఎన్ని కేసులంటే

బ్రేకింగ్ -- దేశంలో కరోనా కేసులు కొత్త రికార్డ్ ఒక్క రోజు ఎన్ని కేసులంటే

0
103

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి… ఏకంగా 1 లక్ష కేసులు రోజువారీ దాటుతున్నాయి.. ఇక పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి రికవరీ కేసులు తగ్గుతున్నాయి…ఇక సెకండ్ వేవ్ విజృంభణ మాములుగా లేదు..

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, మరణాలు కూడా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 780 మంది మరణించారు.

 

దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది. కొత్తగా 61,899 మంది డిశ్చార్జి అయ్యారు, ఇక మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, ఇక్కడ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.. ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక, తమిళనాడు, దిల్లీ పంజాబ్ కేరళ ఎక్కడ చూసినా కేసులు కొత్తవి పెరుగుతున్నాయి కాని తగ్గడం లేదు.

 

మృతుల సంఖ్య 1,67,642కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక టెస్టింగ్ మరింత పెంచాలి అని కేంద్రప్రభుత్వం చెబుతోంది అన్నీ స్టేట్ లకు.. ముఖ్యంగా టీకాలు ఇస్తున్నా కోవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రజలు బయటకు వస్తే కచ్చితంగా మాస్క్ ధరించాలి అంటున్నారు నిపుణులు వైద్యులు అధికారులు.