అనుకున్నట్లే తన పంతం నెగ్గించుకుంది టీడీపీ, ముందునుంచి రాజధాని బిల్లుని అడ్డుకోవాలి అని అనుకున్న తెలుగుదేశం ఫైనల్ గా వైసీపీకి షాక్ ఇచ్చింది.. ఏపీ శాసనమండలిలో, చెప్పినట్టుగానే మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు, వెంటనే టీడీపీ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, రూల్ నంబర్ 71 కింద నోటీసులు ఇచ్చింది.
బిల్లును ప్రవేశపెట్టేముందు తామిచ్చిన నోటీసుపై చర్చించాలని టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అయితే చర్చ లేదని అసెంబ్లీలో ఆమోదం పొందింది కాబట్టి రూల్ 71 పేరు చెప్పి, బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని బుగ్గన స్పష్టం చేశారు. దీనిపై నిబంధనలను పరిశీలించిన మండలి చైర్మన్, రూల్ 71ను పరిగణనలోకి తీసుకుని టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని, చర్చకు అనుమతిచ్చారు.
దీంతో మండలిలో ఈ బిల్లుకు ప్రస్తుతానికి అడ్డుకట్ట పడినట్టే. ఒకవేళ ఇక్కడ బిల్లు వీగిపోతే, డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద అధికార పక్షం, దీన్ని ఆమోదింపజేసుకునే వీలుంటుంది. అయితే ఇది కేవలం మొత్తానికి బ్రేక్ పడినట్లు కాదని వెంటనే ఈ బిల్లు పాస్ చేయించుకుంటాం అని వైసీపీ అంటోంది.
…