రాజధానిని అమరావతిలో ఉంచాలని గొల్లపూడి మెయిన్ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు… ఏపీలో మూడు రాజధానులు రావచ్చని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు…
దీనిపై ప్రతిపక్షాలు మండిపతున్నాయి… ఈ క్రమంలో దేవినేని ఉమా రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు…. నిరసన వల్ల ప్రధాన రహదారిలో ట్రాఫిక్ ఏర్పడటంతో ఆయన్న పోలీసులు అరెస్ట్ చేశారు…
దేవినేని అరెస్ట్ ను కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది… రాజధానిని మార్చద్దంటూ నినాధాలు చేశారు ఉమా… ప్రస్తుతం అమరాతిలో టెన్షన్ వాతావరణం నెలకోంది… కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేశారు…