వైసీపీలో చేరాలా వద్దా అనేదానిపై ఫైనల్ డెసిషన్ చెప్పిన రాయలసీమ టీడీపీ లీడర్…

వైసీపీలో చేరాలా వద్దా అనేదానిపై ఫైనల్ డెసిషన్ చెప్పిన రాయలసీమ టీడీపీ లీడర్...

0
90

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు ఒక్కొక్కరు ఇతర పార్టీల్లోకి జారుకుంటున్న సంగతి తెలిసిందే… ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారికి ఉన్న పరిచయాలతో బీజేపీ వైసీపీల్లోకి చేరిపోయారు…

ఇదే క్రమంలో కర్నూల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని కొద్దికాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇక ఈ వార్తలపై బుడ్డా రాజశేఖర్ స్పందించారు.. తాను వైసీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు…

వైసీపీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.,.. టీడీపీ హయాంలో శ్రీశైలం అభివృద్దికి సహకరించిన చంద్రబాబును వదిలి వెళ్లాల్సిన అవసరంలేదని అన్నారు… వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ అపాట్మెంట్ దొరకడంలేదని అన్నారు… కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎంతో మర్యాద ఇచ్చారని అలాంటి ఆయన వదిలి తాను ఎక్కడికి వెళ్లనని అన్నారు…