పరిటాల కుటుంబానికి బంపర్ ఆఫర్

పరిటాల కుటుంబానికి బంపర్ ఆఫర్

0
129

పరిటాల కుటుంబానికి ముందు నుంచి అనంతపురం జిల్లాలో ఎంతో పేరు ఉంది. అసలు పరిటాల పేరు చెబితేనే అనంతపురం జిల్లా, అనంతపురం జిల్లా అంటే పరిటాల అంటారు. అయితే ఆయన వారసత్వంగా రాజకీయాల్లో ఆయన సతీమణి మంత్రి పరిటాల సునీత తీసుకున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఆయన వారసుడు పరిటాల శ్రీరాం ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగుతున్నాడు. రాప్తాడు అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డితో తలపడుతున్నారు. ఇక్కడ 2004, 2009ల్లో వరుసగా టీడీపీ తరపున సునీత ఆయనపై గెలిచారు. ఇప్పుడు రాప్తాడు సెగ్మెంట్లో వాడీ వేడి ప్రచారం కూడా సాగుతోంది ఇరువురి మధ్య.. పరిటాల కుటుంబానికి మరోసారి విజయం రాప్తాడులో తథ్యం అని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో పరిటాల బ్రాండ్ ఇమేజ్, బీసీల్లో అభిమానం ఉంది. ఇది ఈసారి కలిసి వస్తుంది అని నమ్ముతున్నారు, ఇక సునీత మంత్రిగా రాప్తాడులో చేపట్టిన అభివృద్ది సంక్షేమం వారి ఫ్యామిలీకి మరోసారి గెలుపుగా చెబుతున్నారు, ముఖ్యంగా 36 చెరువులను కృష్ణా జలాలతో నింపడం ఇవన్నీ పార్టీ తరపునే కాకుండా పరిటాల కుటుంబానికి విజయానికి పెద్ద అసెట్ గా చెబుతున్నారు ఇక్కడ నేతలు.