టీడీపీ కంటే ముందే వైసీపీ కీలక నిర్ణయం

టీడీపీ కంటే ముందే వైసీపీ కీలక నిర్ణయం

0
105

తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య రసవత్తర పోటీ అనేది కనిపిస్తోంది…ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్దులని రంగంలోకి దింపినట్టే జగన్ కూడా కొత్త అభ్యర్దులను ఈసారి ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతున్నారు. ఎంపీలుగా కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు జగన్.
తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోక్సభ, శాసనసభ అభ్యర్థులకు ‘బి’ ఫామ్ల (అభ్యర్థిత్వాలను అధీకృతం చేసే పత్రాలు) పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ చేపట్టింది. ఇప్పటికే వైసీపీ అధినేత 175 అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్దులకు 25 పార్లమెంట్ అభ్యర్దులకుఇచ్చే బీఫారాలపై సంతకాలు చేశారు

నిన్నటి నుంచి జిల్లాల వారీగా పార్టీ సమన్వయకర్తలకు పంపిణీ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. 80 శాతానికి పైగా అభ్యర్థులకు ప్రత్యేక సహాయకుల ద్వారా పంపుతున్నారు. కొందరు అభ్యర్థులు తామే స్వయంగా తీసుకువెళ్లనున్నారు. నామినేషన్ల గడువు ముగియడానికి బాగా ముందుగానే ‘బి’ ఫామ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక జగన్ మరో 5 రోజులు మాత్రమే నామినేషన్లకు సమయం ఉండటంతో అందరూ తొందరగా నామినేషన్ వేసి ప్రచారాల్లో ముందుకు వెళ్లాలి అని పిలుపునిచ్చారు నేతలకు. దీంతో నేతలు అందరూ బీ ఫామ్ లు అందుకుంటున్నారు.