జనసేనలోకి నాగబాబు ఎంపీ సీటిచ్చిన పవన్

జనసేనలోకి నాగబాబు ఎంపీ సీటిచ్చిన పవన్

0
52

మొత్తానికి పవన్ కల్యాణ్ సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇటీవల యూట్యూబ్ లో రాజకీయంగా పలు వీడియోలు పెడుతూ రాజకీయ పార్టీలను షేక్ చేస్తున్న నాగబాబు, పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరి రాజకీయంగా ముందుకు స్టెప్ వేస్తున్నారు.. ఇప్పటి వరకూ జనసేన కార్యకర్తగా మాత్రమే ఆయన పోరాటం చేస్తున్నారు, ఇక ఆయన పార్టీ తరపున నాయకుడిగా పోరాటం చేయనున్నారు.

కొణిదెల నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో నాగబాబు జనసేనలో చేరబోతున్నారు. ఇక ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అన్నదమ్ములు ఫోకస్ చేశారు, పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నరసాపురం నుంచి నాగబాబు ఎంపీగా పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నారట. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయాలి అని భావించినా, నాగబాబుకి కుదరలేదు. ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీలో ఆయనకు మంచి ఆఫర్ వచ్చింది అని అంటున్నారు పార్టీ నేతలు.